Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్యవైశ్య సంఘం దసరా ఆత్మీయ సమ్మేళనం

ఆర్యవైశ్య సంఘం దసరా ఆత్మీయ సమ్మేళనం

- Advertisement -

నవతెలంగాణ -నిజామాబాద్ సిటీ 
నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం దసరా ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిషన్ గంజ్ లో ఆదివారం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

నేటి తరం ఆర్యవైశ్యులు ఆయనను ఆదర్శంగా తీసుకొని పార్టీలకతీతంగా సంఘ అభివృద్ధి కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “మహిషాసుర రాక్షసుని అమ్మవారు సంహరించినందుకే దసరా పండుగను ధర్మం అధర్మంపై గెలుపు సూచికగా జరుపుకుంటాం. రాబోయే దసరా వరకు అందరిలోని దుర్గుణాలు తొలగిపోవాలని, సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు. అలాగే ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఏ రాజకీయ పార్టీలలో ఉన్నప్పటికీ ముఖ్య లక్ష్యం ఆర్యవైశ్యుల ఐక్యత, అభివృద్ధి కావాలని స్పష్టం చేశారు. “పార్టీలకతీతంగా మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే, తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ముందుండే సేవలు అందిస్తుంది” అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన “డిక్షనరీలో రెండే రెండు పదాలకు మాత్రమే స్థానం ఉందని – ఒకటి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, రెండోది ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం” అని తెలిపారు.

ప్రభుత్వ సంబంధం లేకపోయినా, తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఆర్యవైశ్య సంఘానికి అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, కోశాధికారి గాలి నాగరాజు గుప్తా, ప్రోగ్రాం కన్వీనర్లు వీరమల్లి రమేష్ గుప్తా, పబ్బరాజు గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -