– రేగా, మెచ్చా వి ఒంటెద్దు పోకడలు
– తిరుగుబాటుకు ఐనా సిద్ధమే
– మాజీ ఎమ్మెల్యే తాటి
నవతెలంగాణ – అశ్వారావుపేట
బీఆర్ఎస్ జిల్లా అద్యక్షులు రేగా కాంతారావు,నియోజక ఇంచార్జి అని చెప్పుకుంటున్న మాజీ ఎమ్మెల్యే మెచ్చి నాగేశ్వరరావు లు ఒంటెద్దు పోకడలు పోతూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేసారు. ఆయన ఆదివారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని ఓ అపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
గతేడాది వర్షాలకు పెద్దవాగు ప్రాజెక్ట్ ధ్వంసం అయితే నేటికీ దానిని పరిశీలించడానికి బీఆర్ఎస్ రాష్ట్రస్థాయి నాయకులు ఎవరూ రాలేదని,ఇదే విషయం అనేక సార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి నా స్థానిక నాయకుల కొందరి తప్పుడు సమాచారంతో రావట్లేదని ఆరోపించారు.దీంతో టీఆర్ఎస్ నియోజక వర్గం పై వివక్ష చూపుతున్నట్లు అర్ధం అవుతుందని ఆక్షేపించారు. నియోజవర్గం కేంద్రంలో నో లేక దాని పరిధిలోని ఏదో ఒక మండల కేంద్రంలో నిర్వహించాల్సిన సమావేశాలను ఎవరికీ తెలియకుండా మెచ్చా తన వ్యవసాయ క్షేత్రాల్లో తనకు నచ్చిన కొందరి వ్యక్తులతో ఏర్పాటు చేస్తున్నారని ధ్వజం ఎత్తారు.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వచ్చినా మాజీ ఎమ్మేల్యే అయిన తనకు సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో ట్రైకార్ చైర్మన్ గా రూ.270 కోట్లు తో అనేక మందికి రుణాలు మంజూరు చేయించాలని తెలిపారు.సమిష్టి నిర్ణయాలు కాకుండా ఏకపక్ష ఒంటెద్దు పోకడలు పోతే పార్టీలో ఉండే తిరుగుబాటు చేస్తానని,దమ్ముంటే ఎదురు కో రేగా కాంతారావు అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అంకత మల్లికార్జున్ రావు,సర్పంచ్ లు పొట్టిగా రాజులు,కారం ఎర్రయ్య,నల్లపు రామారావు లు పాల్గొన్నారు.