Monday, October 6, 2025
E-PAPER
Homeక్రైమ్ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై కారు రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యక్తి మరణించిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఆర్టీవో చెక్ పోస్ట్ దాటిన తర్వాత మొదటగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు మనోహర్, నిశాంత్ లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మరో ద్విచక్ర వాహనంపై సీతాఫలాలు అమ్ముకుంటున్న లక్ష్మీ నగర్ తాండ గ్రామానికి చెందిన శంకర్ ( 55 ) ను ఢీకొనగా ఆయన అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన యువకులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం మరణించిన శంకర్ పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అజాగ్రత్తగా నడిపి కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -