Monday, October 6, 2025
E-PAPER
Homeసినిమాఎన్నో అందమైన మధుర జ్ఞాపకాలు..

ఎన్నో అందమైన మధుర జ్ఞాపకాలు..

- Advertisement -

80ల్లో వెండితెరపై రాణించిన దక్షిణాది, ఉత్తరాది నటీనటులుందరూ ఒకేచోట కలిశారు. ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని సరదాగా గడిపారు. చిరంజీవి, వెంకటేష్‌, జాకీ ష్రాఫ్‌, ప్రభుతోపాటు మరో 27 మంది స్టార్స్‌ని ఒకేచోట చేర్చిన ఎయిటీస్‌ స్టార్స్‌ రీయూనియన్‌- స్నేహం, ఐక్యతను అద్భుతంగా చూపిన ఆత్మీయ వేదికగా నిలిచింది. మొత్తం 31 మంది స్టార్స్‌ కలిసి ఈనెల 4న చెన్నైలో సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ వేడుకల్లో తారలంతా అలనాటి విశేషాలను, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ ఏడాది ఈ రీ-యూనియన్‌ వేడుకను రాజ్‌కుమార్‌ సేతుపతి, శ్రీప్రియ దంపతులు తమ ఇంట్లోనే జరిపారు.

లిస్సీ లక్ష్మి, పూర్ణిమ భగ్యరాజ్‌, ఖుష్బూ, సుహాసిని మణిరత్నం ఈ కార్యక్రమాన్ని కోఅర్దినేట్‌ చేశారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు హిందీ పరిశ్రమ నుండి కూడా స్టార్స్‌ వచ్చారు. దీనిపై చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘ఎయిటీస్‌ స్నేహితులతో ప్రతి రీయూనియన్‌ మధుర జ్ఞాపకాల వీధిలో ఒక నడకలా ఉంటుంది. నవ్వులు, ఆప్యాయత, పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆనందం, ప్రేమతో గడుస్తుంది. ఎన్నిసార్లు కలిసినా ప్రతి సారి కొత్తగా, మొదటిసారి కలిసినట్టే సంతోషంగా అనిపిస్తుంది’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -