రాగి పిండి నుంచి తయారయ్యే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే అనేక మంది అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాగి పిండితో తయారైన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటుంటారు. రాగుల్లో ప్రధానంగా కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు (B-కాంప్లెక్స్, విటమిన్ C, విటమిన్ E) పుష్కలంగా ఉంటాయి. అదనంగా, ఇందులో శరీరానికి అవసరమైన ఖనిజాలు (మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం), యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు కూడా ఉండి శరీరానికి అవసరమైన న్యూట్రిషన్లు అందిస్తాయి. ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం, ప్రతిరోజు ఆహారంలో రాగి రోటీలు, రాగి లడ్డూలు చేర్చడం మంచిదని చెబుతున్నారు.
ముఖ్యంగా రాగి లడ్డూలు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
ఎముకల ఆరోగ్యం :
రాగిలో ఎక్కువగా కాల్షియం ఉండటంతో ఎముకలను బలోపేతం చేయడానికి ఇది సహాయపడుతుంది. బోలు ఎముకల వ్యాధులు, ఎముకల నాసమాన్యతలు నివారించడానికి రాగి లడ్డూలు ఉపయోగపడతాయి. పిల్లలు, వద్ధులు ప్రతిరోజు రాగి లడ్డూలు తినడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
రక్తహీనత తగ్గింపు
రాగి లడ్డులో ఐరన్ సమద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి శక్తిని ఇస్తుంది. రక్తం తక్కువగా ఉన్నవారు రాగి లడ్డూలను డైట్‌లో భాగంగా చేర్చడం ఉత్తమం.
మధుమేహ నియంత్రణ
రాగి లడ్డూలలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా విడుదలవుతాయి. దీని ద్వారా మధుమేహంతో బాధపడేవారికి రక్తంలోని చక్కెర స్థాయి సులభంగా నియంత్రణలో ఉంటుంది.
బరువు నియంత్రణ
రాగి లడ్డులోని ఫైబర్ పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి కావలసిన శక్తి ఇస్తూ బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం
రాగి లడ్డులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. అదనంగా ఫైబర్, విటమిన్ B3 (నియాసిన్) కలిగివుండటం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీని ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, దీర్ఘకాలిక హృద్రోగాలు రాకుండా ఉంటాయి.
రాగి లడ్డూతో….
- Advertisement -
- Advertisement -