పలువురు ప్రముఖుల నివాళి
గ్రుడ్లవల్లేరు: కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రుకు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్) అధినేత పురిటిపాటి కృష్ణారెడ్డి తల్లి పురిటిపాటి విజయలక్ష్మి (75) ఆదివారం మృతిచెందారు. డోకిపర్రులోని స్వగృహంలో తెల్లవారుజామున ఆమె మరణించారు. విజయలక్ష్మి భౌతికకాయాన్ని ఆమె తమ్ముడు పామిరెడ్డి పిచ్చిరెడ్డి (పిపి రెడ్డి), మాజీ మంత్రులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు.
విజయలక్ష్మికి ఇద్దరు కుమారులు. కృష్ణా రెడ్డి చిన్న కుమారుడు. విజయలక్ష్మి అంతిమయాత్రలో మెయిల్ అధినేత కృష్ణారెడ్డి, వైఎస్‌ఆర్ సన్నిహితుడు కెవిపి రామచంద్రరావు, రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, గుడివాడ ఎంఎల్‌ఎ వెనిగండ్ల రాము, దెందులూరు ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్, ఎంపి సీఎం రమేష్ తదితర ప్రముఖులతో పాటు డోకిపర్రు గ్రామస్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాభివృద్ధిలో విజయలక్ష్మి పాత్ర ఎంతో అమూల్యమైనది. మెయిల్ వారు నిర్వహిస్తున్న కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సిఎస్‌ఆర్) కింద గ్రామాభివృద్ధిలో ఆమె పాత్ర కీలకమైనది. పేద వర్గాలకు ఆమె ఎనలేని సేవలందించారు. డోకిపర్రులోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
మెయిల్ అధినేత కృష్ణారెడ్డికి మాతృవియోగం
- Advertisement -
- Advertisement -