బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు
అందోలులో అలయ్.. బలయ్..
నవతెలంగాణ-జోగిపేట
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దోపిడీ పార్టీలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా అందోలులోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాలులో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదేండ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకోవడానికి డబ్బులు లేకపోవడంతో బాధపడుతుందని అన్నారు. ఎన్నికల్లో అబద్దపు హమీలను ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల పంటలు నాశనమయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం పంటల నష్టపరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని తెలిపారు. కోర్టు కేసుల పేరుతో స్థానిక ఎన్నికలను జాప్యం చేస్తుందన్నారు. రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా తయారైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల్లో మెజార్టీ సీట్లను గెలుచుకొంటామని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు వట్‌పల్లి మండలం పోతుల బోగూడ గ్రామానికి చెందిన న్యాయవాది చంటి దేవిక ప్రభు తన అనుచరులతో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి, మండల అధ్యక్షురాలు మహేష్కర్ పావని సుమన్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్.. దోపిడీ పార్టీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES