- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : స్థానిక ఎన్నికల్లో BCలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో-9ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున లాయర్లు సింఘ్వీ, దవే వాదనలు వినిపిస్తున్నారు. విచారణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో ఎలాంటి తీర్పు వస్తుందని ఉత్కంఠ నెలకొంది.
- Advertisement -