- పరుగులు తీసిన పెట్రోల్ పంప్ సిబ్బంది, స్థానిక ప్రజలు, వాహన చోదకులు..
నవతెలంగాణ-హైదరాబాద్: నగరంలోని ఓ పెట్రోల్ బంకులోకి ఫిల్లింగ్ కోసం వచ్చిన కారులో మంటలు చెలరేగిన ఘటన ఖైరతాబాద్ భారత్ పెట్రోల్ బంకులో చోటుచేసుకుంది. స్థానికులు, బంకు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రమంజిల్ రెడ్ రోస్ కేఫ్, పెట్రోల్ పంపు వెనుకాల ఏషియన్ గ్యాస్ట్రో ఆస్పత్రి, ముందర నెస్ట్ గెలేరియా మెట్రో మహల్, పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి దాటినాక వయా ఖైరతాబాద్ వెళ్ళే ప్రధాన రహదారిపై ఉన్న భారత్ పెట్రోల్ బంకులోకి సోమవారం మధ్యాహ్నం ఓ కారు వచ్చింది. వచ్చిన కాసేపటికే కారులో మంటలు చెలరేగాయి. దీంతో పెట్రోల్ బంకు సిబ్బంది, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కారులోని మంటలు కాస్తా పెట్రోల్ బంకులో వ్యాపించి ఉంటే పరిస్థితి ఏంటని ఒక్కసారిగా అందరూ ఊహించుకుని ఉలిక్కిపడ్డారు. తృటిలో పెద్ద ప్రమాదమే తప్పిందని బంకు యజమాన్యం ఊపిరి పిల్చుకుంది. అయితే కారులోని మంటలు ఎందుకు వ్యాపించాయనే విషయంపై సమాచారం తెలియాల్సింది.