Monday, October 6, 2025
E-PAPER
Homeఖమ్మంరాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్న సాత్విక్ 

రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్న సాత్విక్ 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
విశ్వ జ్యోతి సంక్షేమ సంఘం,లాలా పేట,సికింద్రాబాద్ వారు ప్రతీ ఏటా విశ్వకర్మ బిడ్డలకు అందించే విద్యా జ్యోతి ప్రతిభా పురస్కారానికి అశ్వారావుపేట కు చెందిన సిద్ధాంతపు సాత్విక్ సాయి కుమారా చార్యులు ఎంపికయ్యాడు. ఆదివారం లాలా పేట లోని విశ్వ జ్యోతి భవనంలో  అత్యంత వైభవంగా జరిగిన సంస్థ 42 వ వార్షికోత్సవ వేడుకలలో విశ్వ జ్యోతి మహిళా విభాగం అధ్యక్షురాలు శారద,విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం సభాపతి,తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ రిజిష్ట్రార్ డాక్టర్ త్రిమూర్తుల గౌరీశంకర్, యాదాద్రి ఆలయ పున:నిర్మాణ శిల్పాచార్యులు ,స్థపతి పద్మశ్రీ  డాక్టర్ వేలు ఆనందాచార్య గారి చేతులమీదుగా జ్ఞాపిక,నగదు బహుమతి, ధృవీకరణ పత్రాన్ని అందుకున్నాడు.

10 వ తరగతిలో 572 మార్కులు సాధించి అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణుడైన విశ్వకర్మ బిడ్డ గా  ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు చింతపట్ల విష్టుచారి తెలిపారు. సాత్విక్ పై చదువులలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ డాక్టర్  పెదపాటి నాగేశ్వరరావు, తెలంగాణా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మాతృ సంఘం అధ్యక్షులు, తెలంగాణా రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ వేములవాడ మదన్మోహనాచార్య, ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మశ్రీ టిపోజు పాండురంగా చార్యులు, సంస్థ కార్యదర్శి చింతపట్ల మహేశ్వరా చారి, వి.యస్ ఉదయ్ కుమార్, ట్రస్ట్ ఛైర్మన్ చింతపట్ల సాయిబాబా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు సి.ఇ.ఒ చింతపట్ల  వెంకటాచారి, బ్రహ్మశ్రీ ఆలేటి సిద్ధి రాములు తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవంలో భాగంగా నిర్వహంచిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -