Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి

బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి

- Advertisement -

నవతెలంగాణ  – మిరుదొడ్డి
ఉద్యోగ భద్రతతో పాటు బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని పార్ట్ టైమ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నం రాజు పేర్కొన్నారు. సోమవారం మిరుదొడ్డి మండలం అల్వాలలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల- కళాశాల ఎదుట భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మూడు నెలల నుంచి పార్ట్ టైం ఉద్యోగులతో పాటు పొరుగు సేవల కింద విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు నాలుగు నెలల నుంచి వేతనాలు ప్రభుత్వం విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల స్పందించి వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కనకరాజు, శ్రీధర్, అశోక్, సత్యం, ప్రశాంత్, బీరప్ప, చారి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -