- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల ప్రారంభం: అక్టోబర్ 13; నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్ 21; నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22; నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: అక్టోబర్ 24 అని షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
- Advertisement -