నవతెలంగాణ – కంఠేశ్వర్
రోటరీ క్లబ్ ఆప్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మోపాల్ మండలంలోని సిర్పూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాత పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. రాత పుస్తకాలను పంపిణీ చేయడం వల్ల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందని క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు తెలియజేశారు. క్లబ్ ఆధ్వర్యంలో ఇటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నామని, ఇంకా చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ రొటేరియన్ గంజి రమేష్, సభ్యులు రొటేరియన్ గిరీష్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ ఆప్ జేమ్స్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES