Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాన్ని రైతుల సద్వినియోగం చేసుకోవాలి

కొనుగోలు కేంద్రాన్ని రైతుల సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

– కమ్మర్ పల్లి సింగిల్ విండో చైర్మన్ అధ్యక్షులు రేగుంట దేవేందర్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కమ్మర్ పల్లి సింగిల్ విండో చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తహశీల్దార్ గుడిమేల ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ అధ్యక్షులు రేగుంట దేవేందర్ మాట్లాడుతూ సింగిల్ విండో పరిధిలోని రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధరలను పొందాలన్నారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలకు రూ.2389, బి గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.2369 చెల్లించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి శరత్,  మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ, విస్తీర్ణ అధికారిని సరస్వతి, విండో కార్యదర్శి యు.శంకర్, డైరెక్టర్లు రేంజర్ల మహేందర్, తీగల హరీష్, విండో సిబ్బంది, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -