నియోనాటల్ వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్ కు తరలింపు..
నవతెలంగాణ – బజార్ హాత్నూర్
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం దెడ్రా గ్రామానికి చెందిన నిఖిత ప్రసవించగా శిశువు తక్కువ బరువుతో పుట్టింది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్య సిబ్బంది నియోనాటల్ వాహనానికి సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన సిబ్బంది పైలెట్ శివ కుమార్ ఆస్పత్రికి వచ్చి శిశువును ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ఈ సందర్భంగా నియోనాటల్ వాహన సిబ్బంది మాట్లాడుతూ… తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు ఊపిరితిత్తులు, హృదయం పూర్తిగా అభివృద్ధి చెందవని, ఇతర సమస్యలు కూడా వస్తాయని అందుకే వారిని వెంటనే ఎస్ఎన్సీయూ వార్డ్కి తరలించాల్సి ఉంటుందని తెలిపారు. నవజాత శిశువుల మరణాల నివారణే లక్ష్యంగా 2024లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక వైద్య పరికరాలు ఉన్న నియోనాటల్ వాహ నాలను ప్రవేశపెట్టిందని వెల్లడించారు.
తక్కువ బరువుతో శిశువు జననం.. రిమ్స్ కు తరలింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES