నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మానిక్ బండర్ గ్రామం నిజామాబాద్ లోని మున్సిపల్ రెండవ డివిజన్ లో కలువడంతో నగర పాలక సంస్థ గ్రామన్ని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గత 15 రోజులుగా త్రాగు నీరు రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్ని సార్లు పోన్ చేసిన స్పందించడం లేదని తెలిపారు. గత రెండు రోజుల నుంచి ట్యాంకర్ ద్వారా త్రాగు నీటిని అందిస్తున్నారని, అవి సరిపోవడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇపుడే ఇలా ఉంటే వచ్చే వేసవి కాలంలో ఎలా ఉంటుందోనని చర్చించుకుంటున్నారు. అంతే కాకుండా గ్రామంలో గత రెండు నెలలుగా సుమారు 70 స్తంభాలకు విది లైట్ లు వెలుగటం లేదని, నగర పాలక సంస్థ అంటే ఇలాగే ఉంటుందా అని వాపోతున్నారు. ఇప్పటికైనా మంచి నీటిని అందించి, విది లైట్లు వెలిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రెండవ డివిజన్ లో నీటి తంట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES