అన్ని ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటాం…
ఓట్ చోరీ కరపత్రాలను విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్..
నవతెలంగాణ – జన్నారం
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని, మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలు, జడ్పిటిసిని కైవసం చేసుకుంటామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆర్ఆర్ బంకట్ హాల్ లో మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల, ఎంపీటీసీ ఆశావాహుల తో సమావేశం నిర్వహించారు.
అనంతరం ఒక్కొక్క పంచాయతీ నుండి కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు. దేశంలో గత ఎన్నికల్లో జరిగిన ఓటు చోరీకి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ .. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీ ఖాన్, పార్టీ నాయకులు గుర్రం మోహన్ రెడ్డి ఏనుగు సుభాష్ రెడ్డి, మాజీ ఎంపీపీ మచ్చ శంకరయ్య, నందు నాయక్ అజ్మత్ ఖాన్ సోహిన్షా పార్టీ నాయకులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు.