- Advertisement -
– శ్రీశ్రీశ్రీ వాల్మీకి మహర్షి ఆశ్రమ కమిటీ
నవతెలంగాణ – అశ్వారావుపేట
శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ని పురస్కరించుకుని ఈ నెల 7 వ తేదీ మంగళవారం అశ్వారావుపేటలో నిర్వహించే వేడుకలను విజయవంతం చేయాలని శ్రీశ్రీశ్రీ వాల్మీకి మహర్షి ఆశ్రమ అశ్వారావుపేట కమిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలోని తూర్పు బజారులో వేంచేసియున్న వాల్మీకి ఆశ్రమం వద్ద శ్రీశ్రీశ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మంగళవారం అత్యంత వైభవోపేతంగా జరుపుతున్నట్లు కమిటీ బాధ్యులు నాగు తెలిపారు. కావున వాల్మీకి సోదర సోదరి లందరూ ఈ జయంతి ఉత్సవంలో పాల్గొని జయప్రదం చేయగలరని ఆయన కోరారు.
- Advertisement -