– సకాలంలో రక్తదానం చేసిన రక్తదాతలకు అభినందన
– ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరమల్ల గ్రామానికి చెందిన నారాయణ (68) కు ప్లేట్ లేట్స్ అత్యవసరమయ్యాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. వెంటనే స్పదించిన ఆయన రక్తదాతలు రాకేశ్, మణికంఠ, జగదీశ్వర చారిల సహకారంతో తెల్ల రక్తకణాలను కాలంలో అందజేయడం జరిగిందని అన్నారు. ఒక వ్యక్తి చేసే రక్తదానంతో ముగ్గురు ప్రాణాలను కాపాడవచ్చు అని ఆయన తెలిపారు. ఒక యూనిట్ రక్తం నుండి ప్లాస్మా,తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలను వేరు చేయడం జరుగుతుందని అన్నారు. రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించుకొని ప్రాణాలను కాపాడడానికి ముందుకు రావాలని, రక్తదానం చేసిన రక్త దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ హైమద్, ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ లు పాల్గొన్నారు.
వృద్ధునికి ప్లేట్ లెట్స్ అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES