- Advertisement -
నవతెలంగాణ – మునుగోడు
మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన సూర రమణమ్మ అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెదిరే పూలమ్మ ఫౌండేషన్ సభ్యులు వెదిరే విజేందర్ రెడ్డి రమణమ్మ భౌతికానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరమర్శించి పదివేల ఆర్థిక సాయంని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రమణమ్మ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఆ కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చిన వెదిరే పూలమ్మ ఫౌండేషన్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -