చీర్లవంచ పిహెచ్సి ఆకస్మిక తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
పీహెచ్సి పరిధిలో ఉన్న 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా వేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి డాక్టర్ ఎస్ రజిత అన్నారు. తంగళ్ళపల్లి మండలంలోని చీర్లవంచ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డి ఎం హెచ్ ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీలో సిబ్బంది హాజరు రిజిస్టర్ను, కేంద్ర ఆరోగ్య పథకాల పలు రికార్డులను పరిశీలించి రక్త పరీక్ష ల్యాబ్ ను పరిశీలించారు.
రోగుల వద్ద నుండి సేకరించిన రక్త నమూనాలను సకాలంలో జిల్లా కేంద్ర తెలంగాణ ల్యాబ్ కు పంపించవలసిందిగా సూచించారు.అలాగే 0-5 సంవత్సరాల వ్యాధి నిరోధక టీకాల( వ్యాక్సిన్) నిలువలను పరిశీలించారు. కోల్డ్ చైన్ 2 నుండి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.మందుల నిల్వలను పరిశీలించి క్రమ పద్ధతిలో వ్యాక్సిన్ నిల్వ చేయాలని ఫార్మసీ ఆఫీసర్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారికి డాక్టర్ శరణ్య సిబ్బంది పాల్గొన్నారు.