- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: సోమవారం ఉదయం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) బిఆర్ గవాయ్ పై షూ విసిరేందుకు యత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్‌ని బార్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది. కాగా, సోమవారం ఉదయం కోర్టులో విచారణ సమయంలో రాకేష్ కిషోర్ అనే న్యాయవాది సిజేఐపైకి తన చెప్పుని విసిరే యత్నం చేశారు. వెంటనే భద్రతాసిబ్బంది అప్రమత్తమై అతనిని కోర్టు బయటకి లాకెళ్లి పోలీసులకి అప్పగించారు. తాను ఆ సమయంలో.. సనాతనానికి జరిగే అవమానాన్ని మేము సహించము అని గట్టిగా అరిచారు.
- Advertisement -