నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు పిఏ ఆకుల చంద్రశేఖర్, పెద్దపల్లి డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్, మంథని ప్రభుత్వ హాస్పటల్ సూపర్డెంట్ డాక్టర్ రాజశేఖర్, కాంట్రాక్టర్ అఖిల్ లతో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ లు హాస్పిటల్ కార్మికుల సమక్షంలో సోమవారం చర్చలు జరిపారు. హాస్పిటల్ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరించాలని అక్టోబర్ 1 తారీఖున మంత్రి కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో హాస్పటల్ కార్మికులు నిరసన తెలియజేశారు. అదేరోజు వెంటనే మంత్రి స్పందించి సాయంత్రంలోగా నాలుగు నెలల జీతాలను కార్మికులకు అకౌంట్లో జమ చేయడం జరిగిందమన్నారు. ఇంకా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేయడంతో చర్చలు జరపడం జరిగిందని, రెండు నెలల బకాయి వేతనాలు ప్రభుత్వం నుండి రాగానే అకౌంట్లో జమ చేస్తామని నెల నెల వేతనాలు అందిస్తామని ప్రతి కార్మికుడికి పిఎఫ్ సక్రమంగా అమలు చేస్తామని ఈఎస్ఐ సౌకర్యాలు,కార్మికుల సెలవులు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ చర్చలలో హాస్పటల్ కార్మికులు శ్రావణ్, భరత్, అనిల్, శ్రీకాంత్, పూర్ణిమ, రమదేవి ,లక్ష్మి, రజిత, కార్మికుల పాల్గొన్నారు.
హాస్పటల్ కార్మికుల చర్చలు సఫలం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES