Monday, October 6, 2025
E-PAPER
Homeజిల్లాలుస్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి 

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి 

- Advertisement -

పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు 
నవతెలంగాణ – పెద్దవంగర

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.‌ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి వివరించాలన్నారు. పార్టీ లో చేరిన నాయకులు భవిష్యత్తు లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో నాయకులు సమన్వయంతో పనిచేస్తూ, అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగుర వేయలన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొమ్మరబోయిన ప్రదీప్, మాజీ వార్డు సభ్యుడు భూక్యా కృష్ణ, నాయకులు ఠాగూర్ ముత్యం, రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -