Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..

బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..

- Advertisement -

నవతెలంగాణ – గండీడ్/ మహమ్మదాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలనిపరిగి మాజీఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారంమండల కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడిమండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను దగా చేసిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన రెండు సంవత్సరాల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు.కాంగ్రెస్‌ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేరవేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలన్నారు. ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ నాయకులు ఎన్నో హమీలు ఇచ్చారని,తీరా గద్దెనెక్కాక విస్మరించారన్నారు.

రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైందన్నారు.బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాలతో పాటు తులం బంగారం ,రైతుబంధు, యువతులకు స్కూటీలు అందించకుండా దగా చేసిందని గుర్తుచేశారు. రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యూరియా కోసం రైతులు నిద్రాహరాలు మాని షాపుల ఎదుట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడితే బీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధిస్తుందన్నారు. గ్రామాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికల నిర్వహణపై చర్చించుకోవాలని, విజయానికి అవసరమైన గ్రామ స్థాయి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలోబీఆర్‌ఎస్‌ ఉమ్మడిమండలాధ్యక్షులుపెంట్యా నాయక్,బిక్షపతి,మాజీజడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీఎంపీటీసీలు,మాజీ సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -