Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలి

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలి

- Advertisement -

పోలింగ్ భూతులను పరిశీలించిన
కాటారం డిఎస్పీ సూర్యనారాయణ
నవతెలంగాణ – మల్హర్ రావు

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల జెడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్,బార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని కాటారం డిఎస్పీ సూర్యనారాయణ కోరారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాల మేరకు డీఎస్పీ, కొయ్యుర్ ఎస్ఐ నరేశ్ తో కలిసి సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో పలు పోలింగ్ బూతులను పరిశీలించారు. అనంతరం ప్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అసంఘటిత కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -