Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్టీసీ ఆన్లైన్ టెండర్ రద్దు చేస్తామంటూ బెదిరింపు

ఆర్టీసీ ఆన్లైన్ టెండర్ రద్దు చేస్తామంటూ బెదిరింపు

- Advertisement -

కలెక్టర్ న్యాయం చేయాలని బాధితుల మొర..
నవతెలంగాణ – ఆర్మూర్

ఆర్టీసీ ఆన్లైన్ టెండర్ రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్నారని పట్టణానికి చెందిన రతన్ వినోద్, ఓటర్ కార్ సంతోష్ లు తెలిపారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ  మున్సిపల్ పట్టణ కేంద్రంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దుకాణాల సముదాయం లో గత 20 సంవత్సరములుగా రతన్ మొబైల్ షాప్, అపూర్వ ఫోటో స్టూడియో కొనసాగుతుండగా గతంలో రూ.8000 కిరాయి ఉండేదని అన్నారు. కరోనా సమయంలో షాపులు బంధు ఉండడం మూలంగా ఒక సంవత్సరం పొడిగింపు చేయడంతో ఇప్పుడు 20% పెంచడం జరిగింది.

అది కాస్త 9600 కిరాయి అయ్యింది. ఈ సంవత్సరం కొరకు టెండర్లు పిలవగా ఆన్లైన్లో టెండర్లను కాస్త వేయడం జరిగింది. ఇది ఆర్టీసీ నిజామాబాద్ ఆర్ఎం దగ్గర 50 వేల రూపాయలను డిపాజిట్ చేయడం జరిగిందని అన్నారు.. అదనంగా 1700 వందల రూపాయలు ప్రాసెసింగ్ కింద, పెన్ డ్రైవ్ కొరకు 3500 రూపాయలు కట్టడం జరిగింది. ఈ టెండర్లలో 10100 ఒక వంద రూపాయలకు టెండర్ వేయడం జరిగింది. ఈ టెండర్ కాస్తా 5సంవత్సరాల కొరకు. ఇది రెండవ సంవత్సరం 5శాంతం, మూడవ సంవత్సరం 10శాతం, నాలుగొ సంవత్సరం 15శాంతం పెంచడం జరుగుతుంది. దీనికి ఎవరు టెండర్లు వేయకపోవడంతో అధి కాస్త మాకే వచ్చింది. అయినా వారు మాకు ఇవ్వకుండా ఇంకా ఐదువేల రూపాయలు పెంచితేనే ఇట్టి షట్టర్ను  స్వాధీన పరుస్తామన్నార పి,. లేదంటే క్యాన్సల్ చేస్తామని మాపై దౌర్జన్యంగా చేయడం జరుగుతుంది.

క్యాన్సర్ చేసే అధికారం మాకు ఉన్నదని వాళ్లు మాపై ఒత్తిడి చేస్తున్నార  , వాళ్లు ఇచ్చిన ఆన్లైన్ టెండర్ ప్రకారం కాదని అదనంగా 5000 రూపాయలు మా దగ్గర వసూలు చేయాలనే దురుద్దేశంతో దుశ్చర్యలకు పాల్పడుతున్న ఆర్టీసీ అధికారులను వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను వేడుకుంటున్నాము. ఇది కాకుండా మాపైన అధికంగా జీఎస్టీ అని చెప్పి 18 శాతం వసూలు చేస్తున్నారు. స్వచ్ఛభారత్ అని చెప్పేసి నెలకు 600 రూపాయలు వసూలు చేస్తున్నారు. అవి కాకుండా మున్సిపల్ టాక్స్ కింద సంవత్సరం కు 1000 రూపాయలు అది వసూలు చేస్తున్నారు. ఇన్ని వసూలు చేసినా కూడా మాకు న్యాయ పరంగా రావలసిన టెండర్ అది కాస్త అడ్డుకుంటున్నటువంటి ఆర్టీసీ అధికారులను కలెక్టర్ చర్యలు తీసుకోవాలని దయచేసి మా పైన న్యాయం చేయాలని కోరినారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -