Monday, October 6, 2025
E-PAPER
Homeక్రైమ్పట్టపగలే వృద్ధురాలిని బురిడీ కొట్టించిన కేటుగాళ్లు 

పట్టపగలే వృద్ధురాలిని బురిడీ కొట్టించిన కేటుగాళ్లు 

- Advertisement -

బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామనివృద్ధురాలి బంగారు ఆభరణం కాజేసి వైనం..
దొంగలకు దేహశుద్ధి చేసి షాద్ నగర్ పోలీసులకు అప్పగించిన స్థానికులు..
నవతెలంగాణ- షాద్ నగర్ రూరల్ 

పట్టపగలే వృద్ధురాలిని బురిడీ కొట్టించి బంగారు ఆభరణాలను కాజేసిన సంఘటన సోమవారం ఫరూక్నగర్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామంలో వెలుగు చూసింది. బంగారు ఆభరణాలను తళ తళ మెరిసేలా చేస్తామని చెప్పి ఆ తర్వాత బంగారు నగను కాజేసిన ఇద్దరు దొంగలను గ్రామస్తులు చాకచక్యంగా పట్టుకొని దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలిజెర్ల గ్రామానికి చెందిన వృద్ధురాలు బ్యాగరి చిన్నమ్మ ఇంటి వద్దకు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు అని, బంగారు నగలకు మెరుగు పెడతామని నమ్మించారు. వృద్ధురాలు వారి మాటలను నమ్మి వెండి కడియాలు ఇచ్చింది. వాటిని బాగా శుభ్రం చేసి మెరిసేలా చేశారు. ఆ తరువాత మెడలో ఉన్న 1.5గ్రాముల బంగారు గుండ్ల హారం కూడా మెరిసేలా చేస్తామని చెప్పడంతో వృద్ధురాలు చెన్నమ్మ నగను వారికి ఇచ్చేసింది. అంతలోని ఇంట్లో స్టవ్ పై నీళ్ళు పోసి పసుపు వేసి అందులో నగలు వేసినట్లు నటించారు. తెల్లగా అయిందని వాటిని టిఫిన్ బాక్స్ లో పెట్టామని వృద్ధురాలికి చెప్పారు.

అంతలోనే వృద్ధురాలికి మైకం వచ్చేలా చేశారు. మహిళ మత్తు నుండి కోలుకొని తన నగ తోపాటు వచ్చిన ఇరువురు కనిపించక పోవడంతో బోరున విలపిస్తు ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై అగంతకులను వెతకగా గ్రామంలో టీ షాప్ వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకుని గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి దేహశుద్ధి చేశారు. దీంతో తామే నగను కాజేశామని ఒప్పుకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకొని గ్రామంలో విచారణ చేపట్టారు. వారి నుంచి తెల్లని పౌడర్లు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోకి వచ్చే అపరిచితుల నుండి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరు కనిపించిన పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గ్రామస్తులు పోలీసుల సహకారంతో మృదురాలికి బంగారు నగను తిరిగి అందజేయడంతో వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేసింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -