– తాసిల్దార్ కార్యాలయం మొదట బాధితుల ఆందోళన
నవతెలంగాణ – కామారెడ్డి
తమకు చెందిన 4 గుంటల భూమిని తప్పుడు దృవపత్రాలు సృష్టించి కొందరు మార్పిడి చేసుకున్నారని భూ యజమానులు సోమవారం మాచారెడ్డి తహశీల్ధార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం బాధితులు సిరిగద మహేష్ గౌడ్, నర్సాగౌడ్, రవి గౌడ్ తమ భూమిని తమకు ఇప్పించాలని తహశీల్ధార్ సరళాకు వినతి పత్రాన్ని అందజేశారు. పూర్తి విచారణ చేసి సమస్యను పరిష్కరిస్తానని తహశీల్ధార్ హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ తాత ముత్తాతలకు చెందిన 4 గుంటల భూమి ఉందని తెలిపారు.
స్థలం పక్కనే ఉన్న రైస్ మిల్ యజమానులు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్ల సహకారంతో భూమిని మార్పిడి చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిలో రేకుల షెడ్డును వేసుకొని కబ్జాలో ఉన్నామని తెలిపారు. గత పది రోజుల క్రితం రైస్ మిల్ యజమానులు దౌర్జన్యంగా షెడ్డును తొలగించారని పేర్కొన్నారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
తప్పుడు పత్రాలతో భూమిని కబ్జా చేస్తున్నారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES