Tuesday, October 7, 2025
E-PAPER
Homeఆటలుముగిసిన ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నీ

ముగిసిన ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నీ

- Advertisement -

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ జిల్లా చెస్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 55వ తెలంగాణ ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌ సోమవారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా ముగిసింది. అండర్‌-9, 11, 13, 15 బాలికలు, బాలుర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. బాలికల విభాగంలో ఎర్రోజు రమ్య (అండర్‌-15), ఆసిరెడ్డి సహాస్ర (అండర్‌-13), స్వర దీపక్‌ (అండర్‌-11), సారిక టి (అండర్‌-9), రినయార వర్మ (అండర్‌-7) విజేతలుగా నిలిచారు. బాలుర విభాగంలో కె చరణ్‌తేజ్‌ (అండర్‌-15), ఆద్రిత్‌ (అండర్‌-13), పెంజర్ల పూజిత్‌ అయాన్‌ (అండర్‌-11), జితిన్‌ యలవర్తి (అండర్‌-9), రేయాన్షు సింఘాల్‌ (అండర్‌-7) టైటిల్స్‌ సాధించారు. తెలంగాణ చెస్‌ సంఘం ఆఫీస్‌బేరర్లు టి పుణ్యవతి, నరసింగ్‌రావు, మధుసుధన్‌ రెడ్డి, కెఎస్‌ ప్రసాద్‌లు విజేతలకు ధ్రువపత్రాలు, బహుమతులు ప్రదానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -