బిఎఫ్‌ఐ కప్ 2025
చెన్నై : తెలంగాణ స్టార్ బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్ బిఎఫ్‌ఐ కప్ (బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల 60 కేజీల విభాగంలో సర్వీసెస్ తరఫున బరిలోకి దిగిన హుసాముద్దీన్ సోమవారం జరిగిన సెమీఫైనల్లో 5-0తో మితేశ్ దేశ్వాల్ (రైల్వేస్)పై ఘన విజయం సాధించాడు. మెన్స్ 55 కేజీల విభాగం సెమీస్‌లో స్టార్ బాక్సర్ అమిత్ పంగాల్ 1-4తో సహచర సర్వీసెస్ బాక్సర్ ఆశీష్ చేతిలో అనూహ్య ఓటమి చవిచూశాడు. మాజీ యూత్ చాంపియన్లు అంకుశిత, అరుంధతిలు పసిడి పంచ్ విసిరారు. మహిళల 65 కేజీల విభాగం ఫైనల్లో అంకుశిత బోరో 3-2తో పార్థవి (రాజస్తాన్)పై గెలుపొందగా.. అరుంధతి చౌదరి మహిళల 70 కేజీల విభాగం ఫైనల్లో 5-0తో స్నేహపై మెరుపు విజయం సాధించింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్ కాంస్య పతక విజేత పర్వీన్ హుడా మహిళల 60 కేజీల విభాగం ఫైనల్లో ప్రియ (హర్యానా)పై 3-2తో గెలుపొంది స్వర్ణం సొంతం చేసుకుంది.
ఫైనల్లో హుసాముద్దీన్
- Advertisement -
- Advertisement -