ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్
గువహటి : బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్స్‌లో ఆతిథ్య భారత్ శుభారంభం చేసింది. సోమవారం గువహటిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆరంభమైన మెగా ఈవెంట్‌లో భారత్ సహా అగ్ర జట్లు బోణీ కొట్టాయి. రెండో సీడ్ భారత్ గ్రూప్-హెచ్‌లో నేపాల్‌పై 45-18, 45-17తో అలవోక విజయం సాధించింది. ఇదే గ్రూప్‌లో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో యుఏఈపై శ్రీలంక 30-45, 45-34, 45-44తో మెరుపు విజయం ఖాతాలో వేసుకుంది. 14 సార్లు చాంపియన్, అగ్రజట్టు చైనా వరుస సెట్లలో ఘనాపై అలవోక విజయం సాధించింది. గ్రూప్ దశలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి.
ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో ఈ సారి సరికొత్త రూల్స్ అమలు చేశారు. సాధారణంగా పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచులు టీమ్ ఈవెంట్‌లో ఉంటాయి. కానీ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో బిడబ్ల్యూఎఫ్ పూర్తిగా కొత్త ఫార్మాట్‌ను అమలు చేసింది. ప్రతి విభాగంలో 9 పాయింట్ల చొప్పున కేటాయిస్తూ.. తొలుత ఏ జట్టు 45 పాయింట్లు సాధిస్తుందో ఆ సెట్‌లో వారినే విజేతగా ప్రకటిస్తున్నారు. ప్రతి సెట్‌లో ఆటగాళ్లను మార్పు చేసుకునే వెసులుబాటు సైతం కల్పించటంతో భారత్ అందరినీ బరిలోకి దింపింది.
భారత్ శుభారంభం
- Advertisement -
- Advertisement -