ఫైబ్రోమయాల్జియా దీర్ఘకాలిక నొప్పిó. ఇది ముఖ్యంగా కండరాలు, ఎముకలు, కీళ్ళలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఈ వ్యాధి బాధితులు అలసట, నిద్రలేమి, మానసిక ఒత్తిడిని కూడా అనుభవిస్తారు. ఈ వ్యాసంలో, ఫైబ్రోమయాల్జియాకు ప్రధాన కారణాలు, ఒత్తిడి ఎలా కండర బలహీనతకు దారితీస్తుంది? సమగ్ర వైద్యం (Integrative Medicine) ద్వారా దీనికి ఎలా పరిష్కారాలు కనుగొనవచ్చు అనే విషయాలు చర్చిద్దాం.
ఫైబ్రోమయాల్జియాకు ప్రధాన కారణాలేంటో తెలుసుకుందాం.
1.మానసిక ఒత్తిడి : తీవ్రమైన ఒత్తిడి శరీరంలోని నాడీవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వలన నొప్పి గ్రహించే పద్ధతి మారిపోతుంది. కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు నిరంతరంగా విడుదలవుతూ శరీరాన్ని అలసటకు గురిచేస్తాయి.
- నిద్రలో అంతరాయం: సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీర కండరాల్లో, నొప్పికి దారితీస్తుంది.
- జీవనశైలి: అలసిపోవడం, పోషకాహార లోపం, శారీరక కార్యకలాపాల లోపం మొదలైనవి కూడా ఫైబ్రోమైల్జియాను ప్రేరేపించవచ్చు.
- హార్మోనల్ మార్పులుహొ: సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లలో అసమతుల్యత ఫైబ్రోమయాల్జియా లక్షణాలను ప్రేరేపిస్తుంది.
- ఇన్ఫెక్షన్లు లేదా ఇతర వ్యాధులు: కొన్ని వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఫైబ్రోమయాల్జియాకు ట్రిగ్గర్‌గా పనిచేస్తాయి.
- శారీరక లేదా మానసిక గాయాలుహొ: ప్రమాదాలు, శస్త్రచికిత్సలు లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడి ఫైబ్రోమయాల్జియాకు దారితీయవచ్చు.
ఒత్తిడి ఎలా కండర బలహీనతకు దారితీస్తుంది?
ఒత్తిడి ఫైబ్రోమయాల్జియా లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇది కండరాల బలహీనతకు కూడా కారణమవుతుంది.
కార్టిసోల్ స్థాయిలు పెరగడం: ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది కండరాల కణజాలాన్ని దెబ్బతీస్తుంది, నొప్పిని పెంచుతుంది.
న్యూరోట్రాన్స్మిటర్ల అసమతుల్యత: ఒత్తిడి వల్ల సెరటోనిన్, డోపమైన్ వంటి రసాయనాలు తగ్గిపోయి, నొప్పి పెరుగుతుంది.
నిద్రలేమి, అలసట: ఒత్తిడి వల్ల నిద్ర లేకపోవడం, కండరాలు సరిగ్గా విశ్రాంతి పొందకపోవడం వల్ల బలహీనత కలుగుతుంది.
సమగ్ర వైద్యం (Integrative Medicine) ద్వారా ఫైబ్రోమయాల్జియా నివారణ
సాధారణ వైద్యంతో పాటు, సమగ్ర వైద్యం ఫైబ్రోమయాల్జియా నివారణకు సహాయపడుతుంది. ఇది శారీరక, మానసిక, భావోద్వేగ అంశాలను సమన్వయపరుస్తుంది. కొన్ని ప్రధాన పరిష్కారాలు: - ఆహారంలో మార్పులు
8 ఆంటీ-ఇన్ఫ్లమేటరీ ఆహారం: ఆవాల గింజలు లేదా అలసంద గింజలు, ఆకుపచ్చ కూరలు, టర్మరిక్ వంటి ఆహారాలు నొప్పిని తగ్గిస్తాయి.
8 ప్రొటీన్, మెగ్నీషియం: కండరాల ఆరోగ్యానికి ప్రోటీన్, మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఉదా :(గుమ్మడికాయ గింజలు, బాదాం, చియా గింజలు, క్వినోవా, నల్ల శెనగలు, గుడ్లు, సాల్మన్ చేప) - యోగా, ధ్యానం :
– యోగా, ప్రాణాయామం ఒత్తిడిని తగ్గించి, కండరాల సాగదీతకు సహాయపడతాయి.
– మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ నొప్పి నిర్వహణలో సహాయకారిగా ఉంటుంది.
– నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
– మానసిక ఒత్తిడి, డిప్రెషన్ తగ్గించి మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది.
– శరీర ఫంక్షన్, మానసిక స్పష్టత, శక్తి స్థాయిలను పెంచుతుంది.
– ఇతర దీర్ఘకాలిక వ్యాధుల (హార్ట్ డిసీజ్, డయాబెటిస్) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. - హెర్బల్, నేచురల్ సప్లిమెంట్స్
– టర్మరిక్, జింజర్: వీటిలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గిస్తాయి.
– విటమిన్ డి, మెగ్నీషియం: ఈ పోషకాలు కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
4.మానసిక కౌన్సెలింగ్:
– ఒత్తిడిని గుర్తించడం, దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించడం
– నెగటివ్ ఆలోచనలను మార్చడం. - ఆల్టర్నేటివ్ థెరపీలు
– మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, (ఎనర్జీ హీలింగ్ (బయో ఎనర్జీ ఫ్రీక్వెన్సీ, మైండ్ఫుల్‌నెస్, ఒత్తిడిని తగ్గించి హోలిస్టిక్గా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. - ఫైబ్రోమయాల్జియాలో శారీరక వ్యాయామం ప్రాముఖ్యత
– ఆరంభంలో తక్కువ సమయంతో ప్రారంభించాలి,ఆయాసపడకుండా నెమ్మదిగా ముందుకు వెళ్లాలి.
– మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించి, అవసరమైనప్పుడు వ్యాయామాన్ని సర్దుబాటు చేసుకోవాలి. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా తక్కువ ప్రభావం కలిగించే వ్యాయామాలు (వాకింగ్, స్విమ్మింగ్, యోగా) శరీరానికి మేలు చేస్తాయి
– స్ట్రెచింగ్/ యోగా: శరీర సౌలభ్యాన్ని మెరుగుపర్చడం, ప్రశాంతత కోసం
– స్ట్రెంగ్త్ ట్రైనింగ్: తేలికపాటి వెయిట్లు లేదా రెసిస్టెన్స్ బ్యాండ్లతో కండరాల బలాన్ని పెంచడం
ముగింపు
ఫైబ్రోమైల్జియా కేవలం శరీర నొప్పుల వ్యాధి కాదు. ఇది మనస్సు, జీవనశైలి, శరీర వ్యవస్థల సమతుల్యత లోపించడంతో ఏర్పడే ఒక సంక్లిష్ట సమస్య. దీనికి సమగ్ర దష్టితో చికిత్స చేస్తే మాత్రమే పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. ఇంటిగ్రేటివ్ వైద్య విధానం ద్వారా శరీరం, మనస్సు, ఆత్మ సమతుల్యతను తీసుకువచ్చి, ఫైబ్రోమైల్జియాను సహజంగా అధిగమించవచ్చు.
”చిన్నచిన్న ప్రయత్నాలు, నెమ్మదిగా ప్రారంభించి, నిరంతరం కొనసాగిస్తే, ప్రతి అడుగూ బలాన్ని అందిస్తుంది.”.
Dr.Prathusha. Nerella MD(General Medicine) CCEBDM; CCGDM; NLP; FID Ph: 8897684912/040-49950314