నవతెలంగాణ-హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై దాడి సంఘటనను కర్నాటక హోంమంత్రి జీ పరమేశ్వర్ ఖండించారు. ప్రధాన న్యాయమూర్తి దాడికి యత్నమంటే..ఇది మూమ్మటికి అత్యున్నత స్థానాన్ని అవమానించడంతోపాటు భారత్ రాజ్యాంగంపై దాడి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి యత్నించిన లాయర్‌ఫై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని బెంగళూర్ విలేఖర్లు సమావేశంలో డిమాండ్ చేశారు.
సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై వృద్ధా న్యాయవాది రాకేశ్ కిషోర్(71) ఊహించని రీతిలో షూ విసిరేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అడ్డుకుని కోర్టు వెలుపలకు లాక్కెళ్లిపోయారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని రక్షించాలంటూ పదే పదే నినాదాలు చేశాడు. సనాతన ధర్మానాన్ని అవమానిస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశాడు. ఈ పరిణామంతో కోర్టు ప్రాంగణం అవాక్కైంది. ఇక ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని.. యథావిధిగా కార్యక్రమాలను గవాయ్ కొనసాగించారు. గవాయ్‌పై దాడిని ప్రధాని మోడీ సహా రాజకీయ పార్టీలన్నీ ఖండించాయి.
ఇదిలా ఉంటే నిందితుడు రాకేష్ కిషోర్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు విడిచిపెట్టేశారు. 3 గంటల పాటు విచారించి వదిలిపెట్టేశారు. రాకేష్ కిషోర్ కోర్టు నంబర్- 1లోకి ప్రవేశించి గవాయ్ నేతృత్వంలోని బెంచ్‌పై షూ విసిరేందుకు ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని బయటకు తీసుకెళ్లారు. దాడి సమయంలో ‘‘సనాతన్ కా అప్మాన్ నహీ సహేగా హిందుస్థాన్’’ అని నినాదాలు చేశాడు.