Tuesday, October 7, 2025
E-PAPER
Homeజాతీయంసీజేఐపై దాడి..ప్రజాస్వామ్య ఆత్మపై దాడి: జార్ఖండ్ సీఎం

సీజేఐపై దాడి..ప్రజాస్వామ్య ఆత్మపై దాడి: జార్ఖండ్ సీఎం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌పై దాడి ఘటనను పిరికిపంద చర్యగా జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన మంగళవారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఘటన ప్రజాస్వామ్య ఆత్మపై దాడిగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థ గౌరవం మరియు స్వాతంత్య్రం ఏ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా మూలస్థంభం.. దానిపై చేయి ఎత్తడం అంటే దేశ రాజ్యాంగంపై చేయి ఎత్తడంతో సమానమని అని అన్నారు. సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో సిజెఐపై ఒక న్యాయవాది షూ విసిరి దాడికి యత్నించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -