నవతెలంగాణ – మల్హర్ రావు
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పోటీలో నిలిసే ఆశావహులు ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం షురూ చేశారు. ఈ నెల 8 వరకు హైకోర్టు తీర్పుతో ఎన్నికలు రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందని తెలిసినా కూడా ఆశావహులు మాత్రం ప్రచారం ఆపడం లేదు. ఒక్కో గ్రామంలో ఒక్కో పార్టీకి ముగ్గురి చొప్పున పార్టీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమకే టికెట్ వస్తుందనే ధీమాతో తమ సన్నిహితులు, స్నేహితులతో కలిసి ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయా ఎంపీటీసీ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు. ఎంతమంది తమకు అనుకూలగా ఉండే అవకాశం ఉంది.. అనే అంశాలపై చర్చించుకుంటూనే మేరకు కులాల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. మండలంలో కాంగ్రెస్ తోపాటు ఇటు బీఆర్ఎస్,అటు బీజేపీ దాదాపు అన్ని గ్రామాల్లో పట్టు ఉండడంతో ఎంపీటీసీ ఎన్నికల్లో తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది.
ఆశావహుల ప్రచారం షురూ.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES