Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవోదయలో ప్రవేశాలకు గడువు పొడగింపు

నవోదయలో ప్రవేశాలకు గడువు పొడగింపు

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్
మండల కేంద్రంలోని జవహార్ నవోదయ విద్యాలయం లో 2026-27 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతులలో ప్రవేశాల దరఖాస్తులకు మంగళవారం గడువు ముగియడంతో ఆ గడువుని అక్టోబర్ 21 వరకు పెంచుతున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాంబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనీ 2025- 26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8వ తరగతి, పదవ తరగతి చదివేవారు అర్హులని ఆయన అన్నారు.2026 ఫిబ్రవరి 7న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు https://www.navodaya.gov.in ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ఇట్టి అవకాశాన్ని గ్రామీణ ప్రాంతలలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -