Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతన్నలు సమస్యలు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

రైతన్నలు సమస్యలు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
గత 20 రోజుల నుండి మొక్కజొన్న కోతకు వచ్చి పంటను ఆరబెట్టడం జరిగిందని అకాల వర్షాలతో కురిసిన పంట వర్షాలకు తడిసి రైతులు నష్టపోయినారని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు వినతి పత్రం అందజేసినారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి, చిట్టి బాజన్న తదితరులు మాట్లాడుతూ.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు లేక గత్యంతరం లేక దళారులకు తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వస్తుందని, రబీలో వరి పంట బోనస్ 500 రూపాయలు చెల్లించాలని అన్నారు. రైతన్న లకు  ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో  కలిగోట ప్రశాంత్, నారాయణ, పాల బాజన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -