సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మల్లేష్
నవతెలంగాణ – అచ్చంపేట
దేశ అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్నా జస్టిస్ గవాయి కోర్టులో న్యాయవాది రాకేష్ కిషోర్ గూటితో దాడి చేయడం పేపర్లు విసిరి వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. దాడి చేసిన లాయర్ ను వెంటనే అరెస్టు చేసి రిమాండ్ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మల్లేష్ డిమాండ్ చేశారు. అమ్రాబాద్ మన్ననూరు కేంద్రంలో విలేకరులతో సమావేశం నిర్వహించి దాడి చేసిన విషయాన్ని తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టు జడ్జి పైనే ఇట్లాంటి దాడులు జరిగితే న్యాయవాదం ఎలా రక్షించబడుతుందని వారు అన్నారు. ఓం దాడి వెనకాల ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ భావజాలంతో కూడుకున్న వ్యక్తిగా ఉండొచ్చని అట్లాంటి వారిని పూర్తిస్థాయిలో విచారణ చేసి కోర్టులో ఉన్న అన్ని పదవుల నుంచి తొలగిస్తూ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
జస్టిస్ గావాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్న ధర్మసనం ముందు సీనియర్ న్యాయవాదులు అత్యవసర కేసులను ప్రస్తావిస్తున్న సమయంలో ఈ సంఘటన జరగడం దురదృష్టం అని దాడి చేసిన న్యాయవాది రాకేష్ కిషోర్ సుప్రీంకోర్టు బార్లు సభ్యుడు పదవి తొలగించాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో ఇది చీకటి రోజని వ్యాఖ్యానించారు. ఈ దాడికి బిజెపి బాధ్యత వహించాలని అన్నారు. చిన్న చిన్న విషయాలు కూడా ట్విట్టర్లో స్పందించే దేశ ప్రధాని ఇంత పెద్ద దాడి జరిగితే ట్విట్టర్లో స్పందించకపోవడం దుర్మార్గం అన్నారు. ఇలాంటి దాడి మళ్లీ పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శంకర్ నాయక్, సయ్యద్ తదితరులు ఉన్నారు.