Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్104 ఉద్యోగుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: సీఐటీయూ

104 ఉద్యోగుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
104 ఉద్యోగులను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిజామాబాదులో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి అని,104 ఉద్యోగులకు ఐదు నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించండి అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో 104 ఉద్యోగుల సమస్యల పైన అదనపు కలెక్టర్కి, డిఎంహెచ్ఓ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో104 ఎఫ్ డి ఎచ్ ఎస్ లో గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బందిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ 104 ఉద్యోగులను పునః నియామకలను (Redeployment) కింద మెడికల్ కాలేజ్ కామారెడ్డి జిల్లాకు సర్దుబాటు చేయడం జరిగింది.

నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిజామాబాదులో ఇందుకు సంబంధించిన పోస్టులలో 104 ఉద్యోగుల కు స్థానం కల్పించాలని వీరికి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిజామాబాదులో గల ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల పై ఖాళీగా ఉన్న పోస్టుల పైన విచారణ జరిపించి తగిన ఖాళీలను గుర్తించి ఆయా ఖాళీ పోస్టులలో వారికి సర్దుబాటు చేయాలని, గత 6 నెలలు గా జీతాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాము. స్కూల్ ఫీజులు, ఇల్లు కిరాయి కట్టలేక, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వీరికి ఏదైనా ఇతర బడ్జెట్ నుండి 5 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని. ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 104 జిల్లా అధ్యక్షులు ఆర్. సురేష్ జిల్లా కార్యదర్శి టి. రమేష్, జె. ప్రసాద్, సంధ్య, కృష్ణ, గంగాధర్, జీవన్ రెడ్డి, మోహన్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -