Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లైసెన్స్ ఆయుధాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి 

లైసెన్స్ ఆయుధాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి 

- Advertisement -

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

స్థానిక సంస్థల ఎన్నికల సందర్బంగా లైసెన్స్ ఆయుధాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి అని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపద్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గల వారు ఆయుధాల ను లైసెన్స్ పొందిన వారు సెక్షన్ 21 ఆఫ్ ఆయుధాల యాక్టు 1959 ప్రకారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని ఆయుధాల లైసెన్స్ పొంది ఉన్నవారు వారి యొక్క లైసెన్స్ ఆయుధాలను సంబంధింత పోలీస్ స్టేషన్లలో ఈ నెల 9లోపు జమ చేయ వలసినదిగా నోటిఫికేషన్ ను జారీ చేశారు. ఎవరయిన లైసెన్స్ ఆయుధాలు జమ చేయనట్లయితే వారిపై ఆయుధాల యాక్టు ప్రకారంగా చట్టరిత్య చర్యలు తీసుకొనబడును అని తెలియజేశారు. ఎవరైతే అట్టి ఉత్తర్వుల నుండి మినహాయింపు పొందగోరుతారో వారు, నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు కార్యాలయంలోని సంబంధిత అధికారిగారికి వ్రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోగలరు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -