Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయం వద్ద వంటశాల నిర్మాణానికి శంకుస్థాపన

ఆలయం వద్ద వంటశాల నిర్మాణానికి శంకుస్థాపన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ శ్రీ షిరిడి సాయి దేవాలయం వద్ద వంటశాల, భక్తుల సౌకర్యార్థం మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ మేరకు మంగళవారం పౌర్ణమిని పురస్కరించుకొని వంటశాల, మరుగుదొడ్ల, మూత్రశాలల నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులు అందించిన విరాళాలతో వంటశాల, మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. భక్తుల అందించే విరాళాలు, ఆర్థిక చేయూతతో ఆలయాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నట్లు వారు తెలిపారు.

తరితగతిన నిర్మాణాలను పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తీసుకురానినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వివరించారు. అనంతరం పౌర్ణమి పురస్కరించుకొని ఆలయం వద్ద అన్న వితరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పోలేపల్లి లచ్చయ్య, బద్దం గంగారెడ్డి, యెనుగందుల శశిధర్, పెంబర్తి నరేష్ కుమార్, పోతు మురళి, పోతు గణేష్, మహిళా సంఘాల సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -