బామ్ సెఫ్ జాతీయ ప్రచారకులు బి. చెన్నయ్య
నవతెలంగాణ – కంఠేశ్వర్
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవై మీద కోర్టులోనే ఓ న్యాయవాది బూటు విసరడం అదీ సనాతన ధర్మం అవమానిస్తే ఊరుకోం అని నినాదాలు చేస్తూ బయటికి వెళ్లడం, గల దాడిని తీవ్రంగా సేఫ్ జాతీయ ప్రచారకులు బి చెన్నయ్య ఖండించారు. చీఫ్ జస్టిస్ గారి స్థాయిలో ఉన్న వ్యక్తిపై కోర్టు మధ్యలో బూటు విసరడం అంటే అది న్యాయవ్యవస్థ మీద దాడి అని, కోర్టు అంటే న్యాయం చేసే గుడి అని తెలియజేశారు. అక్కడే ఇలాంటివి జరిగితే, దేశం ఎటు దిశలో వెళ్తోందో ఒక్కసారి ఆలోచించాలి. ఇది మన అందరి ఓటమి ఇవి ఆగకపోతే రేపు మన ప్రజాస్వామ్యం బూడిదవుతుంది. ఈ దాఢిని తీవ్రంగా ఖండిస్తున్నాం బాద్యున్ని దేశద్రోహం కేసులు పెట్టి ఉరితీయాల్సిన అవసరం ఉందన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES