- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
రామాయణం రచించిన ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకలకు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి కజరిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -