Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాల్య వివాహాలను అరికట్టేందుకు ముందుకు రావాలి

బాల్య వివాహాలను అరికట్టేందుకు ముందుకు రావాలి

- Advertisement -

– బాల్య వివాహాలను నిర్మూలించడానికి ప్రతిఒక్కరు సహకరించాలి
– బాల్య వివాహాలతో అమ్మాయి జీవితంలో ఎన్నో అనర్థాలు కలుగుతాయి 
– సాధన ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ 
నవతెలంగాణ – కామారెడ్డి

బాల్యవివాహాలతో అమ్మాయిల జీవితాల్లో ఎన్నో అనర్ధాలు కలుగుతాయని సాధన ఎన్జీవో జిల్లా కోఆర్డి నేటర్ గిరిజ అన్నారు. మంగళవారం కామారెడ్డి పాల్వంచ, మాచారెడ్డి మండలల పరిధిలోన గ్రామాల్లోని దేవాలయాలు, చర్చీలు, మస్జీదుల ఆవరణలో బాల్యవివాహాల నిర్మూలన బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గిరిజ మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో బాల్య వివాహాలను నిర్మూ లించడానికి ప్రతిఒక్కరు సహకరించాలని తెలిపారు. బాల్య వివాహాలు చేయడం ద్వారా అమ్మాయి జీవన విధానంలో, మానసిక స్థితిలో పరిపక్వత చెందక భవిష్యత్తులో వారి జీవితంలో ఎన్నో రకాల నష్టాలు జరుగుతాయన్నారు. బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు వయసు దాటిన తర్వాతనే వివాహాలు చేయాలని స్పష్టం చేశారు. సమాజంలో బాల్య వివాహాలు జరిగితే నెం 1098, పోలీస్ శాఖ 100 నెంబర్లకు సమాచారం ఇవ్వాల ని సూచించారు. ఈ కార్యక్రమంలో సాధన సంస్థ సభ్యులు జ్యోతి, సంధ్య, రాణి, మమత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -