Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాకవి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్ జిల్లా అదనపు  కలెక్టర్ రెవెన్యూ విక్టర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్  తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ  మహర్షి వాల్మీకి  ఆదికవి, ఆయన రచించిన రామాయణం నిత్యనూతన గ్రంథం,  ఆయన చూపిన సత్యం, ధర్మం, న్యాయం మార్గం ప్రతి మనిషి జీవనానికి మార్గదర్శకం  అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ, ట్రైని డిప్యూటీ కలెక్టర్ రవితేజ, కలెక్టరేట్ ఏవో, డిఎస్సీడీవో వెంకటేష్, డిఎం డబ్ల్యూ సతీష్ యాదవ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్ , సహాయ బీసీ అభివృద్ధి అధికారి చక్రధర్ , నరేష్ , అశ్వాక్, జీవన్, శాంతయ్య, స్వామి, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -