Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జల్‌ జంగిల్‌ జమీన్‌కు ప్రతీక కొమురంభీం..

జల్‌ జంగిల్‌ జమీన్‌కు ప్రతీక కొమురంభీం..

- Advertisement -

– ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గొప్ప మహనీయుడు
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌
నవతెలంగాణ – కాటారం/ (మహాముత్తారం)

ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీమ్ ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. మహాముత్తారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో కొమురంభీం వర్థంతి సందర్బంగా కొమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901లో గోండు కుటుంబంలో జన్మించిన కొమురంభీం తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గిరిజనోద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నమయ్యాడని ఆయన పోరాటస్పూర్తి ఆదర్శమని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -