నవతెలంగాణ-కమ్మర్ పల్లి
భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై జరిగిన దాడిని రాజ్యాంగంపై జరిగిన దాడిగానే భావిస్తున్నట్లు అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు సుంకర విజయకుమార్ అన్నారు. మల్లవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించిన సుప్రీం కోర్ట్ న్యాయవాది రాకేష్ కిషోర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేయాలని చేయాలని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామన్నారు.
దేశ ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడమంటే దేశ ప్రజాస్వామ్యంపై భారత రాజ్యాంగంపై దాడి చేయడమేనన్నారు. దేశ ప్రధాన న్యాయమూర్తి పై దాడిని దేశంలోని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం అన్నారు.తక్షణమే రాకేష్ కిషోర్ పై కేసు నమోదు కఠిన చర్యలు తీసుకోవాన్నారు. ఈ సమావేశంలో మండల అంబేద్కర్ యువజన సంఘం క్రియాశీలక కార్యవర్గ సభ్యులు కొంటికంటి నరేందర్, పాలేపు రాజేశ్వర్, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు