Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డిలా.. ప్రయాణం ఎలా?

రోడ్డిలా.. ప్రయాణం ఎలా?

- Advertisement -

గుంతలతో చెడిపోతున్న వాహనాలు 
స్పందించి గుంతలు పూడ్చాలి 
నవతెలంగాణ-రామారెడ్డి 

మండలంలోని రామారెడ్డి నుండి మద్దికుంట మర్రి వరకు వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు కన్నాపూర్ నర్సరీ వద్ద గుంతల మైమవడంతో వాహనాలు చెడిపోతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఈ రోడ్డు పై నుండి సిరిసిల్ల, సిరికొండ, భీమ్గల్ వైపు వెళ్లే ప్రయాణికులు వందల కొద్ది వాహనాల్లో వెళుతుంటారు. భారీ  వర్షాలతో రోడ్డు చెడిపోయిన అధికారులు గుంతలను పూడ్చకపోవడంతో రాత్రి వేళల్లో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. కొందరు వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయాలై దావకాన పాలైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని వాహనదారులతో పాటు ప్రజలు కోరుతున్నారు.

ఆర్ అండ్ బి ఏ ఈ సూర్యతేజను నవ తెలంగాణ వివరణ కోరగా జిల్లా కలెక్టర్ నిధులనుండి రు 6 లక్షలు మంజూరయ్యాయని, టెండర్ దశలో ఉందని, సాధ్యమైనంత తొందరగా రోడ్డు పని పూర్తి చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -