సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ – కట్టంగూర్
రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వచ్చే అభివృద్ధి శక్తులతో సీపీఐ(ఎం) కలిసి పనిచేస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని అమరవీల స్మారక భవనంలో నిర్వహించిన ఆ పార్టీ మండల కమిటీ సమావేశం లో ఆయన పాల్గొని మాట్లాడారు. బిజెపిని ఓడించడానికి సీపీఐ(ఎం) ప్రధాన భూమిక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కరణకై ప్రధాన ఎజెండాగానే సీపీఐ(ఎం) ముందకు వెళ్తుందని ఆయన తెలిపారు. ప్రజాఉద్యమాలను బలపరిచేందుకు, ముందుకు వెళ్ళటానికి రాజకీయ పదవులు ఒక సాధనంగా ఉపయోగపడుతుందని అన్నారు. సీపీఐ(ఎం)ను బలపరిచి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.
జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం ఏ పార్టీ కలిసివస్తే ఆ పార్టీతో కలిసి పని చేయడానికి పార్టీజిల్లా కమిటీ నిర్ణయం తీసుకొని ముందుకు వెళుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో బలమున్నచోట జడ్పిటిసి స్థానాలలో పోటీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 120 ఎంపీటీసీలు, 200 పై చిలుకు సర్పంచులు, 2000 వార్డ్ మెంబర్లు పోటీ చేయడానికి పార్టీలో చర్చిస్తున్నామని, దీనికి అనుగుణంగా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తూకార్యకర్తలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఎన్నికల్లో గెలుపోటములను నిర్వహించే శక్తి సీపీఐ(ఎం)కి ఉందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించేందుకు ఒంటరిగా పోటీ చేయడానికైనా సీపీఐ(ఎం) సిద్ధంగా ఉంటుందని తెలిపారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, నాయకులు చిలుముల రామస్వామి, గడగోజు రవీంద్రాచారి,జాల రమేష్, ఊట్కూరు శ్రీను,జాల ఆంజనేయులు, కక్కిరేణి రామస్వామి, గంట వెంకన్న,సాగర్ రెడ్డి ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం)ను ఆదరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES